Home » దేశంలోనే సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ ప‌వార్ మ‌ద్ద‌తు మ‌రువ‌లేం : కేసీఆర్

దేశంలోనే సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ ప‌వార్ మ‌ద్ద‌తు మ‌రువ‌లేం : కేసీఆర్

by Anji
Ad

బీజేపీ కి వ్య‌తిరేకంగా పిడికిలి బిగించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసిన తొలి అడుగు బ‌లంగానే ప‌డింది. ఇవాళ మ‌హారాష్ట్ర వేదిక‌గా మ‌హాసంక‌ల్పానికి శ్రీ‌కారం చుట్టారు. దేశ రాజ‌కీయాలు భ‌విష్య‌త్ వ్యూహాల‌పై చ‌ర్చించారు కేసీఆర్‌. తొలుత మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రెను క‌లిసిన త‌రువాత నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.

Also Read :  ఆరెంజ్ త‌ర‌వాత నిర్మాత‌లెవ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేదు..రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్..!

Advertisement

ముఖ్యంగా శ‌రద్ ప‌వాన్ తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఆయ‌న తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇస్తూనే ఉన్నార‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేసారు. చిన్న వ‌య‌స్సులోనే సీఎంగా పాల‌న సాగించిన శ‌ర‌ద్ ప‌వార్ అని కొనియాడారు. దేశ‌శంలోనే ప‌వార్ సీనియ‌ర్ నేత అని అభిప్రాయప‌డ్డారు. ప్ర‌స్తుతం దేశం స‌రైన మార్గంలో న‌డ‌వ‌డం లేద‌ని, ద‌ళితుల వికాసం లేద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చిన ఇన్నేండ్ల త‌రువాత కూడా దేశంలో స‌రైన పాల‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు. దేశం కోసం స‌రైన అజెండా రూపొందించాల‌ని, దేశంలోనే అత్యంత అనుభ‌వం ఉన్న నేత శ‌ర‌ద్ ప‌వార్ అని క‌చ్చితంగా ఆయ‌న త‌మ‌తో క‌లిసి ప‌ని చేస్తార‌ని పేర్కొన్నారు.

Advertisement


ఇత‌ర నేత‌ల‌తో మాట్లాడి ముందుకు వెళ్తామ‌ని, అంద‌రినీ క‌లుపుకొని వెళ్తామ‌ని పేర్కొన్నారు. త‌మ కార్య‌చ‌ర‌ణ ఏమిటో త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అని కేసీఆర్ వెల్ల‌డించారు. దేశ రైతుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం పోరాడింద‌ని, సీఎం కేసీఆర్‌తో ప‌ని చేస్తాం అని, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు. సంక్షేమ ప‌థ‌కాల‌లో దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది అన్నారు. దేశాభివృద్ధికి గురించే ఎక్కువ‌గా కేసీఆర్‌తో చ‌ర్చించామ‌ని భ‌విష్య‌త్‌లో కేసీఆర్‌ను క‌లిసి ఇంకా చాలా విష‌యాలు చ‌ర్చిస్తామ‌ని తెలిపారు.

Also Read :  2024 ఎన్నిక‌ల్లో అండ‌గా ఉండండి.. నేను చావ‌డానికైనా సిద్ధ‌మే : ప‌వ‌న్ క‌ల్యాణ్

Visitors Are Also Reading