Home » KCR : ద‌ళితుల కోసం నూత‌న రాజ్యాంగం రావాలి

KCR : ద‌ళితుల కోసం నూత‌న రాజ్యాంగం రావాలి

by Anji
Ad

దేశంలో ఉన్న ద‌ళితుల బాగోగుల కోసం నూత‌న‌ రాజ్యాంగం రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ద‌ళితుల రిజ‌ర్వేష‌న్లు 19 శాతం పెంచ‌డానికి, బీసీల కుల గ‌ణ‌న కోసం, దేశ‌మంతా ద‌ళిత‌బంధు పెట్ట‌డం కోసం నూత‌న‌ రాజ్యాంగం కావాల‌ని తెలిపారు. దేశం బాగుప‌డాలంటే అంద‌రికీ స‌మాన హ‌క్కుల కోసం రాజ్యాంగం మారాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 77 శాతం దేశ సంప‌ద 90 శాతం మంది ద‌గ్గ‌రే ఉండాల‌నే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.

Also Read :  స‌మంత‌పై ఆలియా కామెంట్స్‌.. ఎందుకో తెలుసా..?

Advertisement

అదేవిధంగా ఆడ‌బిడ్డ‌ల‌కు ఆస్తిలో స‌మాన హ‌క్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాల‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ ట్రంప్‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నిక‌లు ఏమైనా అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు అనుకున్నారా అంటూ ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించారు. అమెరికా ఎన్నిక‌ల‌తో మీకు ఏమి సంబంధం.. ఎవ‌రైనా వేరే దేశం ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తారా..? ఇది విదేశీ నితేనా అని ప్ర‌శ్నించారు. మ‌రొక వైపు హిజాబ్ వివాదంపై కేసీఆర్ స్పందించారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగే ఈ వివాదంపై దేశం మొత్తం మౌనం వ‌హిస్తోంద‌న్నారు.

Advertisement

అంత‌ర్యుద్ధం చెల‌రేగితే దేశం ప‌రిస్థితి ఏమిట‌ని, క‌ర్ణాట‌క మాదిరిగానే దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ప‌రిస్థితిని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ విద్వేష‌పూరిత మ‌త రాజ‌కీయాల గురించి యువ‌త ఆలోచించాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువ‌త మ‌ధ్య ఎందుకు విద్వేశాలు ర‌గులుస్తున్నార‌ని నిల‌దీశారు. శాంతి భ‌ద్ర‌త‌లు కోరుకుందామా..? ఘ‌ర్ష‌ణ‌లు క‌ర్ప్యూలు కోరుకుందామా..? అనేది యువ‌త ఆలోచించుకోవాల‌న్నారు. శాంతి లేని చోట పెట్టుబ‌డులు ఎవ‌రు పెడ‌తార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. మ‌రొక వైపు ప్ర‌జ‌లంద‌రూ అవ‌స‌రం అని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడ‌తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీ పెడ‌తారా అని ఓ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించ‌డంతో.. సీఎం ఇలా సమాధానం ఇచ్చారు. కొత్త పార్టీ పెట్ట‌కూడ‌దా..? పెడితే త‌ప్పా.. ? అని ప్ర‌శ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే ద‌మ్ము త‌న‌కు లేదా అని నిల‌దీశారు.

Also Read :  IPL 2022 Auction: హైద‌రాబాద్ సీపీ కుమారుడిని సొంతం చేసుకున్న కోహ్లీ జ‌ట్టు

Visitors Are Also Reading