Home » SRIREDDY : సోద‌రి శ్రీరెడ్డి దీనిపై స్పందించాలి…తీన్మార్ మ‌ల్ల‌న్న రిక్వెస్ట్….!

SRIREDDY : సోద‌రి శ్రీరెడ్డి దీనిపై స్పందించాలి…తీన్మార్ మ‌ల్ల‌న్న రిక్వెస్ట్….!

by AJAY
Ad

టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. న‌టిగా కంటే వివాదాల‌తోనే శ్రీరెడ్డి ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది. ఇక ప్ర‌స్తుతం శ్రీరెడ్డి యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలు…హోం టూర్ ల‌తో పాటూ సినీరాజ‌కీయ అంశాల‌పై త‌న‌దైన స్టైల్ లో స్పందిస్తూ వీడియోలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ తీన్మార్ మ‌ల్ల‌న్న ఓ విష‌యం పై స్పందించాలి అంటూ త‌న మార్నింగ్ న్యూస్ వీడియోలో కోరారు. ప్ర‌స్తుతం కేంద్రానికి రాష్ట్రానికి వ‌డ్ల పంచాయితీ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

దాంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ర్యాలీలు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్మూర్ ఎమ్మెల్మే జీవ‌న్ రెడ్డి కూడా ర్యాలీ నిర్వ‌హించారు. ఆ వార్త‌ను చ‌దువుతూ మ‌ల్ల‌న్న ఆర్మూర్ పాండూ అంటూ ఆయ‌న పై సెటైర్లు వేశారు. అంతే కాకుండా ఇక ఈ వీడియోపై సోద‌రి శ్రీరెడ్డి స్పందించాలంటూ నొక్కి చెప్పారు. శ్రీరెడ్డి ఈ వార్త‌పై స్పందించాలి అని చెప్ప‌డం వెన‌క ఓ స్టోరీ ఉంది. గ‌తంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ర‌చ్చ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే కేవ‌లం సినిమా వాళ్ల‌ను మాత్రమే కాకుండా రాజ‌కీయనాయ‌కుల‌పై కూడా శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసింది. అలా ఆరోప‌ణ‌లు చేసిన వారిలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి కూడా ఉన్నారు. ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని తాను క‌లిసాన‌ని చెప్పింది. ఓ నిర్మాత చెబితే తాను అక్క‌డ‌కు వెళ్లాన‌ని చెప్పింది. త‌న‌ను ఎమ్మెల్యే గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడంటూ సంచ‌ల‌న నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

Srireddy

Srireddy

అయితే తాను మంచిదాన్ని అని చెప్ప‌డం లేద‌ని కానీ త‌న‌కు అప్పుడు వెళ్లాల‌ని అనిపించ‌లేద‌ని చెప్పింది. అంతేకాకుండా త‌న‌కు సినిమా ఆఫ‌ర్ చేశాడ‌ని…తాను నిర్మాత‌ను అని చెప్పాడ‌ని తెలిపింది. అలా చెప్పి చాలా మంది సినిమా వాళ్ల‌ను లొంగ‌దీసుకున్నాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న‌కు పార్క్ హ‌య‌త్ లో ఓ రూమ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేప‌థ్యంలోనే మ‌ల్ల‌న్న శ్రీరెడ్డి ఎమ్మెల్యే ర్యాలీపై స్పందించాలి అంటూ సెటైర్లు వేశారు. మ‌రి శ్రీరెడ్డి స్పందిస్తుందా..? లేదా అన్న‌ది చూడాలి.

Visitors Are Also Reading