Home » లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కృతిశెట్టి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కృతిశెట్టి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కొంతమంది కథానాయికలు డజన్ల కొద్ది సినిమాలు తీసినా కానీ స్టార్ డం అనేది రాదు. కానీ కొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోతారు. ఆ కోవకు చెందిన ఈ అమ్మడు కృతి శెట్టి. 2001లో వచ్చిన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా విజయవంతంతో కృతికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే నాగ చైతన్యతో జంటగా బంగార్రాజు సినిమాలో కూడా నటించి మెప్పించింది.

దాని వెంటనే శ్యామ్ సింగరయ్ సినిమాలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారింది ఈ అమ్మడు. ఇంకా పలు కొత్త సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కోవూడ్ లో సూర్యతో జతగా 41వ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సందర్భంలో కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది. వారు ఫ్రాంక్ స్టార్లు సారథిరణ్, ఆశిక్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో కృతి బోరున విలపించింది. యాంకర్ల తీరు చూసి తీవ్రంగా ఎమోషనల్ అయింది.

Advertisement

వారిద్దరు కృతి శెట్టిని నేను అడుగుతాను అంటే నేను అడుగుతాను అంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా కేకలు వేసుకుంటూ ఆమె ముందే కొట్లాటకు దిగారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ఆమె భయపడిపోయింది. చాలా తీవ్రంగా ఏడ్చింది. చివరికి వారు ఫ్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. మొదట నవ్విన ఆ తర్వాత దుఃఖాన్ని ఆపుకోలేక లైవ్ లోనే ఏడ్చింది. దీంతో సదరు యాంకర్లు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

Qలో నిలబడి మూవీ టికెట్లు కొన్న మహేష్ బాబు.. ఆ అమ్మాయిని అలా చేశాడేంటి..?

సంజూపై సచిన్ కామెంట్స్.. అలా చేస్తాడు అని నేను అనుకోలేదు..!

 

 

Visitors Are Also Reading