ఐపీఎల్ లో భాగమైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ జట్టు తన పేరును ఎట్టకేలకు ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగనున్నది. ఫిబ్రవరి 09న స్టార్ స్పోర్ట్స్‌లో జట్టు పేరు వెల్లడి అయింది. అహ్మదాబాద్ జట్టు తొలిసారి ఐపీఎల్‌లో ఆడనుంది. ఆ జట్టుకు అహ్మదాబాద్ టైటాన్స్ అని పేరు పెట్టినట్టు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇవాళ సరికొత్త పేరుతో ఐపీఎల్ 2022 బరిలోకి దిగనుంది.
Also Read : హీరో గోపీచంద్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమాలు.
Advertisement
ఈ జట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నారు. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. అహ్మదాబాద్‌తో పాటు, లక్నో ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ 2022 వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హర్దిక్ పాండ్యా, రషీద్‌ఖాన్, శుభ్‌మన్ గిల్ లను రిటైన్ చేసుకుంది. హార్థిక్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లండ్ కు చెందిన విక్రమ్ సోలంకి క్రికెట్ డైరెక్టర్‌గా ఆశిష్ నెహ్రా ప్రధాన కోచ్ గా నియమితులు అయ్యారు. అదేవిధంగా గ్యారీ కిర్‌స్టన్ జట్టుకు మెంటార్స్, బ్యాటింగ్ కోచ్‌గా ఉండనున్నారు. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది.
Advertisement
గుజరాత్ లయన్స్ జట్టు రెండు సీజన్లలో ఆడింది. గతంలో గుజరాత్ జట్టు 2016, 2017లో ఐపీఎల్‌లో కూడా బరిలోకి దిగింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ సస్పెన్షన్ తరువాత పూణే, రాజ్కోట్ ఫ్రాంచైజీలు ప్రవేశించాయి. ఆ సమయంలో రాజ్‌కోట్ ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ అని పేరు పెట్టుకున్నది. ఈ జట్టుకు సురేష్ రైనా కెప్టెన్ గా వ్యవహరించారు. అదేవిధంగా రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఆడారు.
Also Read : మరో దర్శకుడికి పవన్ గ్నీన్ సిగ్నల్…!