Home » ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టీమిండియా దిగ్గజ ప్లేయర్ ఎంట్రీ.. ఆ జట్టులోకేనా..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టీమిండియా దిగ్గజ ప్లేయర్ ఎంట్రీ.. ఆ జట్టులోకేనా..?

by Anji
Ad

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్లను ప్రకటించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మహిళల క్రికెట్ లో సరికొత్త శకాన్ని ఆరంభించింది. ఇప్పుడు క్రికెట్ లో  మహిళా వేలం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు.. మిథాలీ రాజ్ దిగ్గజ ప్లేయర్ ని మరో మారు చూసే అవకాశం తమకు లభిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

కానీ  అది జరిగే విధంగా కనిపించడం లేదు. టీమిండియా మాజీ కెప్టెన్,  వెటరన్ బ్యాట్స్ మెన్ మితాలీరాజ్ డబ్ల్యూపీఎల్ లో ఆడటం లేదు. క్రికెట్ నెక్ట్స్ నివేదిక ప్రకారం.. డబ్ల్యూపీఎల్.. మొదటి సీజన్ లో మిథాలీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో చేరనున్నది. నివేదిక ప్రకారం.. డబ్యూపీఎల్ అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా మారిన అహ్మదాబాద్ గుజరాత్ తో మిథాలీ మెంటార్ పాత్రను పోషించనున్నది. 

Advertisement

Also Read :  Suryakumar Yadav : ICC మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360

Manam News

మిథాలీ ఆడాలని కోరుకుంటుంది. కానీ నివేదికల ప్రకారం.. 5 ఫ్రాంచైజీలలో ఎవ్వరూ మిథాలీపై అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో దీంతో మిథాలీ ఈ సారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిథాలీ మాత్రమే కాదు.. భారత అభిమానులు కూడా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామిని మళ్లీ చూడాలనుకుంటున్నారు. అయితూ డబ్ల్యూపీఎల్ లో ఆడబోనని జులాన్ స్వయంగా స్పష్టం చేసింది. రెండేళ్ల కిందట ప్రారంభమైతే.. తాను ఆడేదానిని అంటూ ఝులన్ పేర్కొన్నది.  

Also Read :   Axar Patel Marriage Photos : ఘనంగా అక్షర్ పటేల్ పెళ్లి, ఫోటోలు వైరల్

Visitors Are Also Reading