Ad
ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా ఇండియా రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ఇండియాకు చాలా కీలకం. గత మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోవడం వల్ల ఈ మ్యాచ్ కు అంత ప్రత్యేకత అనేది వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా మూడు మార్పులతో బరిలోకి రానుంది అని తెలుస్తుంది.
మొదట సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చిన అశ్విన్ ను పక్కన కూర్చోబెట్టనున్నారు అని తెలుస్తుంది. అయితే అశ్విన్ స్థానంలో చాహల్ జట్టులోకి వస్తాడు. ఇక గత మ్యాచ్ లో వచ్చిన దీపక్ హుడాను మళ్ళీ బెంచ్ పైకి పంపిస్తారు అని సమాచారం. హుడా బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేదు. అలాగే అతనితో బౌలింగ్ కూడా చేయించలేదు. అందుకే అతడిని జట్టు నుండి తీసేసి మళ్ళీ అక్షర్ పటేల్ నే తుది జట్టులోకి తేనున్నారు.
ఇక గత మూడు మ్యాచ్ లలో బెంచ్ కు పరిమితం అయిన రిషబ్ పంత్ రేపు జట్టులోకి రానున్నాడు అని సమాచారం. కానీ పంత్ ఎవరి స్థానంలో వస్తున్నాడు అనేది మాత్రం తెలియదు. సఫారీలతో మ్యాచ్ లో గాయపడిన దినేష్ కార్తీక్ స్థానంలోనే పంత్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇకవేళ కార్తీక్ కాకపోతే ఈ ప్రపంచ కప్ లో వరుసగా విఫలం అవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.
Advertisement