Home » త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్..? సోషల్ మీడియాలో వైరల్

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్..? సోషల్ మీడియాలో వైరల్

by Anji
Ad

టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరమే లేదు. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.  ఎందుకు అంటే.. ఆటో డ్రైవర్ కొడుకుగా  కటిక పేదరికాన్ని అనుభవించిన సిరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ బౌలర్ గా దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ భారత్ ఫైనల్ కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా షమీ, బుమ్రా, సిరాజ్ వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. మరోవైపు కొన్ని మ్యాచ్ లలో సిరాజ్ తీసిన వికెట్లే కీలకంగా మారాయి.

Advertisement

ఫైనల్ లో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయారు. అంతకు ముందు విజయం సాధించిన మ్యాచ్ లలో సిరాజ్ పాత్ర చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఎవ్వరూ ఊహించనివిధంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా టీమిండియా అభిమానులు అస్సలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎత్తుకుపోయింది అంటూ బాధపడిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే భారత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పబోతున్నాడు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement

అది ఏంటి అంటే..? హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా సిరాజ్ తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని.. డిసెంబర్ చివరి వారంలో నిశ్చితార్థం, మార్చి చివరిలో పెళ్లి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు భారత క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా హాజరుకాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఇటీవలే సిరాజ్ తన తండ్రిని గుర్తుకు చేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading