టీ20 క్రికెట్లో టీమిండియా చరిత్రని సృష్టించింది ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డుని అందుకుంది. ఇండియా ఆస్ట్రేలియా తో ఐదు T20 సిరీస్ లలో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో 20 పరుగులు తేడాతో గెలిచింది. ఇండియా పాకిస్తాన్ రికార్డులని బద్దలు కొట్టింది. 135 విజయాలతో ఈ జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా 36 విజయాలని అందుకొని మొదటి స్థానానికి వెళ్ళింది.
Advertisement
ఇండియా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన జట్టుగా భారత్ హిస్టరీలోకి ఎక్కింది ఇండియా 213 మ్యాచ్లలో టీం ఇండియా 136 విజయాలని అందుకుంది కేవలం 67 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది మరో వారు మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ 226 మ్యాచులు అడ్డాగా 135 విజయాలని అందుకుంది 82 మ్యాచులను ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వివరాలు చూస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు పూర్తి చేసింది.
Advertisement
జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) స్కోర్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఈ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులును స్కోర్ చెసింది. ట్రావిస్ హెడ్ (16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) అయ్యారు. ఇలా ఇండియా గెలిచింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!