విజయ్ ఆంటోనీ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో కష్టపడి చివరికి స్టార్ హీరోగా ఎదిగారు. విజయ్ ఆంటోనీ ముందుగా డైరెక్టర్ గా.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా, కెమెరా టెక్నీషియన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఇండస్ట్రీలో అన్ని పనులు చేసి ఎలాగైనా హీరో కావాలని పట్టుదలతో బిచ్చగాడు సినిమా ద్వారా తనలోని టాలెంట్ ను నిరూపించుకొని స్టార్ గా ఎదిగారు. విజయ్ ఆంటోని చిన్నతనం నుంచి కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి విజయ్ ఆంటోనీ కూతురు ఇంట్లో ఆ-త్మ-హ-త్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
విజయ్ ఆంటోనీ ఫాతిమా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చారు. అందులో పెద్ద కూతురు పేరు మీరా, చిన్నమ్మాయి పేరు లారా. తన పెద్ద కూతురు అంటే విజయ్ ఆంటోనీకి ప్రాణం. అలాంటి ఆమె సెప్టెంబర్ 19 ఉదయం 3 గంటలకు తన రూమ్ లో ఉ-రే-సుకొని మరణించింది. అయితే ఆమె మరణించిన సమయంలో విజయ్ ఇంట్లో లేరట. తన భార్య ఇంట్లో ఉండడంతో తన రూమ్ లో ఏదో సౌండ్ వచ్చిందని వెళ్లి చూసే సరికి ఫ్యాన్ కి ఉన్న ఉ-రి- తాడుకు వేలాడుతోంది. వైద్యులు పోస్టు మార్టం నిర్వహించి మీరా ఆంటోని ఆ-త్మ-హ-త్య-నే అని వెల్లడించారు వైద్యులు. మీరా ఆంటోని గురించి ఓ సందర్భంలో టీచర్లు చెప్పిన విషయాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
Advertisement
మీరా స్కూల్ ఈవెంట్ లో లీడర్ గా ఉన్న సమయంలో ఆమె టీచర్లు మాట్లాడుతూ.. మీరా ఆంటోని మేధావి అని.. మేము చెప్పలేమని అయితే.. మీరా ఆంటోని చాలా తెలివైన అమ్మాయి అని చెప్పారు. చదువులో మీరా ఆంటోని ఫస్ట్ రాదని యాక్టివ్ గా ఉంటుందని తెలిపారు. బొద్దుగా ఉన్నానని.. మీరా ఎంతగానో బాధపడేదని టీచర్లు వెల్లడించారు. ఇతర పిల్లలతో పోల్చితే తాను చాలా లావుగా ఉన్నానని మీరా ఫీల్ అయ్యేదని పేర్కొన్నారు. మీరా ఆంటోని తనను ఇతరులతో పోల్చి చూసుకొని ఫీల్ అయ్యేదని టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరా ఆ-త్మ-హ-త్య-కి మాత్రం కారణం ఇది కాదని ఏదైనా బలమైన కారణం ఉండవచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :