ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రసవత్తరంగా సాగుతోంది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ, ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వార్ నడుస్తోంది.. ఈ మధ్య కాలంలోనే టిడిపి అధినాయకుడు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఈ లొల్లి మరింత ఎక్కువైంది..ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా మొట్ట మొదటి రోజు వైసిపి మరియు టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
Advertisement
ఈ క్రమంలో వైసిపి ప్లెక్సీలు కట్టడంపై సీరియస్ అయిన చంద్రబాబు, ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీలు తొలగించడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నం చేశాయి.దీంతో ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున గొడవ సాగింది. ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ లను వైసిపి శ్రేణులు ధ్వంసం చేశారు. ఈ పరిణామం జరగడంతో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నిరసన తెలిపారు.
Advertisement
ALSO READ; రఘురామకృష్ణంరాజు సర్వేలో టీడీపీకి తీపి కబురు.. ఏంటంటే..!!
సరిగ్గా ఈ సమయంలోనే ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.. అనంతరం టీడీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ లను నిర్మించుకొని తయారుచేసిన వంటకాలను తీసుకొచ్చి పెట్టారు. చంద్రబాబు ఆ వంటకాలను ప్రజలకు చాలా ఉత్సాహంగా వడ్డించారు.
ALSO READ; ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్నదెవ్వరు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?