తెలంగాణలో సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్ దేశ్ కి నేతగా మారారు. టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించనున్నారు. ఈ తరుణంలో ప్రతి రాష్ట్రంలో ఇన్చార్జిలను నియమిస్తూ వస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ అంతటా పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జిగా మాజీ టిడిపి నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది..
Advertisement
also read:మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!
Advertisement
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏపీలో కూడా పోటీలో ఉండనుంది. ఇప్పటికే విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ తరుణంలోనే ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు ఎవరికి అప్పజెప్తారనేది ఆసక్తికరంగా మారింది.. తెలంగాణ కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.. దీనికి ప్రధాన కారణం కూడా వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తలసానికి మంచి పట్టు ఉంది.. అనేక పరిచయాలు ఉన్నాయి. ఆయన టిడిపిలో పనిచేసినప్పుడు చాలామంది నేతలు సన్నిహితంగా ఉండేవారు. పార్టీ విడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ స్నేహాన్ని మెయిన్ టైన్ చేస్తూ వచ్చినాడు.
అయితే శ్రీనివాస్ యాదవ్ కు అప్పగిస్తే ఏపీలో డీల్ చేయగలరని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నాడు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో సాయికిరణ్ ను బరిలోకి దింపుతారని సమాచారం. 2019 ఎన్నికల సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించారని సమాచారం.. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీ ఇన్చార్జిగా నియమిస్తే మాత్రం చాలామంది టీడీపీ లీడర్లు బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని టాక్ కూడా వినిపిస్తోంది.. మరి చూడాలి ఏం జరుగుతుందో..
also read: