Home » టీడీపీ, జనసేన ఉమ్మడిగా ‘రా..కదలిరా’ కార్యక్రమం

టీడీపీ, జనసేన ఉమ్మడిగా ‘రా..కదలిరా’ కార్యక్రమం

by Bunty
Ad

జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి “రా కదలి రా!” పేరుతో తెలుగుదేశం కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ జరిగింది. సైకిల్ – గాజు గ్లాసు తో కూడిన లోగోను ఆవిష్కరించారు అచ్చెన్నాయుడు. పంచాయితీల సమస్యలపై రేపు సర్పంచులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగనుంది. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగనుంది.

TDP-Janasena New Logo

TDP-Janasena New Logo

5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు జరుగనున్నాయి. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు జరుగుతాయి. 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ ఉండనుంది. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని వెల్లడించారు.

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్ ని ఆందోళనప్రదేశ్ గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం…అన్ని సభలు తెలుగుదేశం – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని.. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదిస్తున్నారు…కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పని చేస్తోందన్నారు .

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading