ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తమ వ్యూహాన్ని మార్చింది. అధికార పక్షంతో ఎదురు దాడికి సిద్ధమయింది. మరింత స్పీడ్ పెంచి కార్యకర్తల్లో జోష్ నింపాలనుకుంటుంది. వర్చువల్‌గా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలక పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read : పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను తిట్టడం ఎంతవరకు కరెక్ట్..?
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. తన కుటుంబంపై వ్యక్తిగత దూషణ చేసారని ఆరోపిస్తూ.. మళ్లీ అధికారం చేపట్టేందుకు అసెంబ్లీకి రాను అని చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసినదే. ఈనెల 07 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయయి. ఆర్థిక మంత్రి బుగ్గన ఈనెల 11న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతాం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
చట్ట సభలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు. మరొక వైపు అమరావతి, పోలవరం విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కోర్టు తీర్పు తరువాతనైనా ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలన్నారు చంద్రబాబు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం అని.. మరొక రెండేండ్లు అయితే చంద్రబాబు అండ్ కో ఈ రాష్ట్రం నుంచి పారిపోతారని విమర్శించారు.
Also Read : Shane Warne : షేన్ వార్న్ తీసిన టాప్-5 వికెట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!