సాధారణంగా మనం దూర ప్రయాణాలు చేయాలంటే ముఖ్యంగా ఎంచుకునేది రైలు మాత్రమే. ఎందుకంటే రైలులో రవాణా చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి మరియు కంఫర్ట్ గా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు ఈ రైలులోనే ప్రయాణిస్తుంటారు. అయితే దూర ప్రయాణాలు చేయాలంటే ముందుగా సీట్లను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్స్ సీట్ అంత త్వరగా దొరకదు.
READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?
Advertisement
ఆ పరిస్థితుల్లో ప్రజలు తత్కాల్ టికెట్లను ఆశ్రయిస్తుంటారు. రద్దీ కారణంగా అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రీమియం తత్కాల్ ప్రయత్నించిన సీట్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే ఒక సులభమైన ఉపాయంతో కన్ఫర్మ్డ్ టికెట్ ను సులభంగా పొందవచ్చు. IRCTC మాస్టర్ లిస్టు ను ఉపయోగించి టికెట్ బుక్ చేయడమే ఆ ట్రిక్.
Advertisement
read also : పారాసిటమాల్ వాడుతున్నారా? వీటి వల్ల గుండెపోటు వస్తుందా!
టికెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ లిస్టు ఎలా ఉపయోగించాలి?
టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు Plan My Journey పై క్లిక్ చేయండి.
ఇప్పుడు స్టేషన్, తేదీని ఎంచుకోండి.
ఆ తర్వాత Go to Passenger Details కు వెళ్లండి.
Add Passengers ఆప్షన్ కు వెళ్లి, మాస్టర్ జాబితా నుంచి ప్రయాణికుల పేర్లను టిక్ చేయండి. దీని వల్ల, టికెట్ బుకింగ్ కోసం ఆటోమేటిక్ గా అన్ని వివరాలు ఫిల్ అవుతాయి.
ఆ వెంటనే డబ్బులు చెల్లించండి, మీ టికెట్ బుక్ అవుతుంది.
Master List కారణంగా, టికెట్ బుకింగ్ కాల వ్యవధి తగ్గుతుంది. అందువల్లే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో కన్ఫర్మ్డ్ టికెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?