Home » Tarakaratna: తారకరత్న ప్రాణాలను కాపాడడంలో ముఖ్య పాత్ర వహించిన ఈయన ఎవరు ?

Tarakaratna: తారకరత్న ప్రాణాలను కాపాడడంలో ముఖ్య పాత్ర వహించిన ఈయన ఎవరు ?

by Bunty
Published: Last Updated on

నందమూరి తారకరత్న, ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జనవరి 27వ తేదీన పాదయాత్ర భారీ కార్యకర్తల మధ్య ప్రారంభించారు. ఈ తరుణంలోనే నందమూరి తారకరత్నకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు అతన్ని కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ గుండె ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం తారకరత్న నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Also Read: రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రభాస్.. ఒక్కడికే అన్ని కోట్లు అయితే సినిమా బడ్జెట్ ఎంతో..?

 

 

Also Read:  బాలయ్య కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి అసలు కారణాలివే!

ఇక కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. అయితే తారకరత్న ఆరోగ్యం కోలుకోవడానికి బాలయ్య, చంద్రబాబులతో పాటు తెరవెనుక మరో ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్. చంద్రబాబు కర్ణాటక సీఎంని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటి నుండి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు సుధాకర్. దీనికోసం అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారాయన.

తారకరత్నను బెంగుళూరు తరలించింది మొదలుకొని ప్రతిక్షణం వైద్యులతో మాట్లాడుతూ పర్సనల్ గా తీసుకొని ఏది కావాలంటే అది సిద్ధం చేయించారు. ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, శివరాజ్ కుమార్ లతో పాటు హాస్పిటల్ కి వెళ్లారు. వీళ్లను రిసీవ్ చేసుకోవడానికి సుధాకర్ స్వయంగా ఎయిర్పోర్టుకి వెళ్లారు. తారకరత్న కోల్కోవడం వెనక ఇంత శ్రమించిన ఆరోగ్య శాఖ మంత్రిని అందరూ అభినందిస్తున్నారు.

READ ALSO : Pooja Hegde : పూజ హెగ్డే ఇంట పెళ్లి సందడి… బుట్ట బొమ్మ ఎమోషనల్ నోట్

Visitors Are Also Reading