నందమూరి వారసుడు టాలీవుడ్ హీరో తారకరత్న ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. తారకరత్న నారాలోకేష్ తో కలిసి పాదయాత్రలో మొదటిరోజు పాల్గొన్నారు. కాగా అదేరోజు యాత్రలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. ఆ తరవాత తారకరత్నను ఆస్పత్రి తరలించి మెరుగైన వైద్యకోసం బెంగుళూరుకు తరలించారు. 23 రోజుల పాటూ మృత్యువుతో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు.
Advertisement
ALSO READ :TSPSC PAPER LEAKAGE : అసలు రేణుక ఎవరు..? పేపర్ లీకేజీలో ఆమె పాత్ర ఏంటి..?
ఇదిలా ఉంటే తారకరత్న అలేఖ్యరెడ్డిని ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న తరవాత తారకరత్న కుటుంబం అతడిని దూరం పెట్టింది. దాంతో తారకరత్న తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదురుకున్నాడు. కాగా తారకరత్న చనిపోయిన తరవాత తమ ఆర్థిక ఇబ్బందుల గురించి మరియు ఫ్యామిలీ గురించి అలేఖ్యరెడ్డి పెడుతున్న పోస్ట్ లు హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
తారకరత్న నెలమాసికం రోజున అలేఖ్యరెడ్డి సోషల్ మీడియా పోస్ట్ లో…నెలమాసికం రోజున నీ సమాధి వద్ద కూడా నిన్ను ఎవరూ పట్టించుకోలేదు. అంటూ ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా పాప పట్టేవరకూ తాము ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నామని ఇప్పటికీ ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నామని పేర్కొన్నారు.
బాలయ్య ఒక్కరే తమకు అప్పుడు ఇప్పుడు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అనలిస్ట్ దాము బాలజీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటినుండి మోహనకృష్ణగారికి కొడుకు పెళ్లి నచ్చలేదు. అందుకే దూరం పెట్టారు. అలా చివరకు కొడుకు మరణించిన తరవాత ఆయన కుటుంబాన్ని కూడా దూరం పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
Advertisement
ALSO READ :“చమ్మీకల అంగీలేసీ” అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?