నందమూరి తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా తారకరత్న మరణవార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఫిబ్రవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లారు తారకరత్న. తన కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజా సేవ చేయాలనే ఆయన 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు.
Advertisement
Ad
తారకరత్న అంత్యక్రియల నిర్వహించిన తరువాత చిన్నకర్మను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు.ఇక నేపథ్యంలోనే నందమూరి హీరో బాలయ్య పెద్ద కర్మ తేదీని ఫిక్స్ చేశారు. తారకరత్న తరపున బాలకృష్ణ, భార్య అలేఖ్య తరుపున విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకొని పెద్ద కర్మ తేదీని ఖరారు చేశారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పుడు.. మరణించిన తరువాత అంత్యక్రియలు ముగిసేంత వరకూ కూడా బాలకృష్ణ అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. నందమూరి హీరో బాలకృష్ణ తారకరత్న కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి తారకరత్న భార్యకి బంధువు కావడంతో తాను కూడా తారకరత్న అంత్యక్రియల్లో భాగమయ్యారు. రాజకీయాలను పక్కన పెట్టి బాలయ్య, చంద్రబాబులతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఆయనపై మరింత గౌరవం పెరిగిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Also Read : నయన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…త్వరలోనే సినిమాలకు గుడ్ బై..?
ఈ నేపథ్యంలో బాలయ్య, విజయసాయిరెడ్డి కలిసి తారకరత్న పెద్దకర్మ తేదీని నిర్ణయించారు. ప్రింట్ చేయించిన కార్డులో బాలయ్య విజయసాయిరెడ్డిలే పెద్దకర్మకు రావాలని బంధు, మిత్రులను ఆహ్వానించారు.మార్చి 02న గురువారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహించనున్నామని కార్డులో ప్రచురించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలయ్య, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులున్నారు. అదేవిధంగా తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లు ప్రచురించారు. ప్రతీ ఒక్కరూ విచ్చేసి తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేసారు.
Also Read : నన్ను పెళ్లి చేసుకుంటారా..? స్టార్ హీరోయిన్ బంపరాఫర్..!