Telugu News » Blog » ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…..కానీ 6 నెలలు కూడా నిండకముందే…!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…..కానీ 6 నెలలు కూడా నిండకముందే…!

by AJAY
Published: Last Updated on
Ads

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు అలా చుస్కుంటా ఇలా చూసుకుంటా అంటూ ఎన్నో ప్రామిస్ లు చేశాడు. కానీ పెళ్ళైన కొద్దిరోజులకే అతడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రేమించి తననే పెళ్లి చేసుకున్న అమ్మాయినే కడతేర్చాడు ఆ కసాయి ప్రేమికుడు. ఈ దారుణమైన ఘటన తమిళనాడు లోని మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి.

Advertisement

 

వెళితే….. మధురై లో ఇటీవల ఓ యువతిని హెల్మెట్ ధరించిన ఓ దుండగుడు కత్తి తో హతమార్చాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడం తో తానే ఆ పని చేసినట్టు యువతి భర్త పోలీసులకు షాక్ ఇచ్చాడు. నిందితుడి పేరు పలని కాగా అతడి భార్య పేరు వర్ష….వీరిద్దరూ ఆరునెలల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి తరవాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్ష తన భర్త ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. దాంతో తిరిగి ఇంటికి రావాలని భర్త ఒత్తిడి తీసుకువచ్చాడు.

Advertisement

Advertisement

ఎంత చెప్పినా భార్య వినకపోవడం తో భూమి పైనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యను కలిసేందుకు వెళ్ళాడు అక్కడ భార్య ఎంత చెప్పినా వినకపోవడం తో తన వెంట తెచ్చుకున్న కత్తితో రోడ్డు పైనే దాడి చేశాడు. ఈ దాడిలో వర్ష తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను అక్కడే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే యువతి మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. తమ కూతుర్ని చంపిన వాడ్ని కఠినం గా శిక్షించాలి అంటూ యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.