టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న కూడా ఇప్పటి అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతోంది. అలాగే భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటుంది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
Advertisement
ఇది ఇలా ఉండగా, ప్రేమ, పెళ్లి ఏదైనా సరే, ముందుగా మీడియాకు చెప్పే చేసుకుంటాను అనేలా ఇటీవల తమన్నా చెప్పుకొచ్చింది. ఆమె ఈ మాటలు చెప్పి కొన్ని రోజులు కూడా గడవకముందే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలలో స్టార్ హీరో నటుడితో దొరికేసింది.
Advertisement
ఈ వీడియోలో విజయవర్మ వైట్ షర్టులో ఉండగా, తమన్న మాత్రం పింక్ కలర్ డ్రెస్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఓ మూలన ఉన్న వీరిద్దరూ హాగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో తమన్నా, విజయవర్మ డేటింగ్ లో ఉన్నారనే విషయం కన్ఫామ్ చేసినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ వీడియో పై తమన్న ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా విజయవర్మ.. నాని హీరోగా నటించిన MCA సినిమాలో విలన్ గా నటించాడు.
Advertisement
Read also : జగన్ సీటుకు కేసీఆర్ ఎసరు..! BRS పార్టీలో చేరిన ఏపీలో కీలక నేతలు