Home » పెళ్లిని పోస్ట్ చేసుకుంటున్న త‌మ‌న్నా..కార‌ణం ఇదే!

పెళ్లిని పోస్ట్ చేసుకుంటున్న త‌మ‌న్నా..కార‌ణం ఇదే!

by AJAY
Ad

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్ర‌స్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది. అంతే కాకుండా ఐట‌మ్ సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. రీసెంట్ గా త‌మ‌న్నా వ‌రుణ్ తేజ్ హీరోగా నటించిన గ‌ని సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసింది. అంతే కాకుండా మెగాస్టార్ హీరోగా న‌టిస్తున్న బోలా శంక‌ర్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు త‌మన్నా రూ.1.5 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

అయితే త‌మ‌న్నా ఈ యేడాది వ‌రకూ సినిమాలు చేసి ఆ త‌ర‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యం తీస‌కుంది. అంతే కాకుండా పెళ్లి చేసుకుని జీవితం లో సెటిల్ అవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కానీ ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మ‌ళ్లీ కెరీర్ గాడిన ప‌డ‌టం తో త‌మ‌న్నా తిరిగి సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌మ‌న్నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా వెబ్ సిరీస్లు, టీవీ షోలు అంటూ వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది.

Visitors Are Also Reading