సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. అయితే బన్నీ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప.. సూపర్ హిట్ గా నిలిచింది. మరి ముఖ్యంగా ఇందులోని అన్ని పాటలతో పాటుగా.. ఐటం సాంగ్ కూడా జనాలకు బాగా నచ్చింది. అయితే మొదట ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీని పెట్టాలి అనుకున్నారు.
Advertisement
అందుకే దిశ పాటనిని సంప్రదించారు. కానీ ఆ అమ్మడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత అది అటు ఇటు తిరిగి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పుష్ప సినిమా యొక్క సీక్వెల్ అనేది వస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా మరో ఐటం సాంగ్ అనేది ఉంది అనేది అందరికి తెలుసు.
Advertisement
కాబట్టి ఈ సాంగ్ లో ఈసారి అయిన ఎవరైనా బాలీవుడ్ భామను పెట్టాలి అని అనుకున్నారు. అందుకే చాలా మందిని చూసారు. అందరూ మొదట ఓకే చెప్పడం.. తరువాత తప్పుకోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. దాంతో మొదటి సినిమా మాదిరే ఈ పాట కూడా అటు ఇటు తిరిగి మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన తమన్నా వద్దకు వచ్చింది అని.. ఇక అందులో చేయడానికి మిల్కీ బ్యూటీ కూడా ఓకే చెప్పింది అని తెలుస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :