Home » Takkar : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘టక్కర్’…ట్రైలర్

Takkar : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘టక్కర్’…ట్రైలర్

by Bunty
Ad

హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సిద్ధార్థ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగారు సిద్ధార్థ్. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వోస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల్లో చేసి సూపర్ హిట్ కొట్టిన ఆయన ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారారు.

Advertisement

కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని పనుల వల్ల సినిమాలు రాకుండా పోయాయి. అయితే సిద్ధార్థ్ కాస్త గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. హీరో సిద్ధార్థ్ నటించిన సరికొత్త చిత్రం ‘టక్కర్’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ ఏకకాలంలో విడుదల కానుంది. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా చేస్తుంది. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధార్థ్ ‘టక్కర్’ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా చేస్తోంది. అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జె విగ్నేష్ కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

వైసిపి నేతలకే దిమ్మ తిరిగే పని చేసిన జనసేన ఎమ్మెల్యే

Manchu Manoj : ‘వాట్ ది ఫిష్’ అంటున్న మంచు మనోజ్

Visitors Are Also Reading