Home » T20 World Cup schedule 2024 : ఇండియా, పాక్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్

T20 World Cup schedule 2024 : ఇండియా, పాక్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్

by Bunty
Ad

 

మెగా ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకు ఇప్పటినుంచే ఫుల్ కిక్ ఎక్కిస్తున్నాయి. జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పటిలాగానే హైలైట్ కాబోతోంది. దాయాదుల పోరు జూన్ 9న జరగబోతోంది. న్యూయార్క్ లో ఇండియా – పాకిస్తాన్ తలపడనున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్న టోర్నీ జూన్ 1న ప్రారంభమవుతుంది. జూన్ 29న ముగుస్తుంది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ – పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-ఏ లో దాయాది జట్లతో పాటు ఐర్లాండ్, కెనడా, అమెరికాకు చోటు దక్కింది.

Advertisement

గ్రూప్-బి లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-సి లో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పుపూవా న్యూగినియా దేశాలు చోటు దక్కించుకున్నాయి. గ్రూప్-డి లో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాలు ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 దశలోనూ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్-8 గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. అయితే ఇండియన్ – పాకిస్తాన్ మ్యాచ్ మీదే అందరి చూపు పడబోతోంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.

కొన్ని ఏళ్లుగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. మేజర్ టోర్నీలోనే తలపడుతున్నాయి. ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో ఢీ కొట్టాయి. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియానే గెలిచింది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్ లోనూ భారత్ – పాకిస్తాన్ తలపడ్డాయి. దాయాది జట్ల మీద టీం ఇండియానే పైచేయి సాధించింది. 2022లోను ఆసియాకప్ తో పాటు టి20 వరల్డ్ కప్ లో ఢీకొట్టాయి. మెల్బోర్న్ లో జరిగిన వరల్డ్ వార్ ఉర్రుతలూగించింది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. థ్రిల్లర్ లా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియానే గెలిచింది. 2022లో జరిగిన ఆసియాకప్ లో ఒక మ్యాచ్ లో భారత్ గెలవగా…. మరో మ్యాచ్ లో పాకిస్తాన్ సత్తా చాటింది. న్యూయార్క్ లో ఈసారి జరిగే పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading