Home » కాంక్రీట్ మిక్సర్ సాయంతో స్వీట్…2లక్షల మందికి భోజనాలు..!

కాంక్రీట్ మిక్సర్ సాయంతో స్వీట్…2లక్షల మందికి భోజనాలు..!

by AJAY
Ad

సాధారణంగా భవనాలు కట్టే ప్రదేశంలో…. సిమెంట్ రోడ్లు వేస్తున్న ప్రాంతాలలో మనకు కాంక్రీట్ మిక్సర్ లు కనిపిస్తూ ఉంటాయి. కాంక్రీట్ మిక్సర్ ద్వారా కాంక్రీట్ మరియు సిమెంట్ ను కలుపుతారు. దాంతో సిమెంట్ రోడ్లు మరియు భవనాలను నిర్మించేందుకు వాడుతుంటారు. కానీ ఇక్కడ కాంక్రీట్ మిక్సర్ సహాయంతో ఓ వంటకం చేశారు. అంతేకాకుండా భోజనాన్ని లక్షలమందికి వడ్డిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…. కాంక్రీట్ మిక్సర్ సాయంతో వంట చేస్తున్న ఘటన మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లా చంబల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Advertisement

మౌని బాబా ఆశ్రమం లో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమం లో కాంక్రీట్ మిక్సర్ ఉపయోగించి పిండివంటకం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రెండు లక్షలకు పైగా భక్తులు భోజనం చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆహారం త్వరగా తయారు చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ ను ఉపయోగించారు. మల్పువా అనే స్వీట్ ను కాంక్రీట్ మిక్సర్ యంత్రంలో వేసి బాగా కలిపారు.

Advertisement

Also read :VIRAL VIDEO : కోతికి సీపీఆర్…అంజ‌న్నా అంటూ మ‌ళ్లీ ఊపిరిపోశాడు …!

అంతేకాకుండా 15 ట్రాలీ ల సహాయంతో భోజనాలు సరఫరా చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాదాపు 100 గ్రామాల్లో నుంచి భక్తులు విచ్చేశారు. వారికోసం పెద్దపెద్ద కడాయిలలో ఆహారం తయారు చేశారు. శనివారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కార్యక్రమంలో లో కాంక్రీట్ మిక్సర్ సహాయంతో మిఠాయి ని కలపడం ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading