అలనాడు తెలుగు ఇండస్ట్రీలో సావిత్రి, జమున, షావుకారు జానకి, భానుమతి, అంజలీదేవి, కృష్ణకుమారి వంటి హీరోయిన్లు ఉండేవారు. ఇందులో సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జమున.. ఈమెను వెండితెర సత్యభామగా కూడా పిలిచేవారు. అలాంటి జమున మరణం అందరిని కలచి వేస్తోంది. ఈ తరుణంలో ఆమె గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి..అయితే జమున ఒకరోజు అర్ధరాత్రి తన ఇంట్లో ఉండగా బాగా మద్యం తాగి ఎస్వి రంగారావు ఆమె దగ్గరికి వెళ్ళాడు.. తర్వాత ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అది గుండమ్మ కథ సినిమా తీస్తున్న రోజులు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమున, సావిత్రి, ఎస్వీ రంగారావు సూర్యకాంతమ్మ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు.
Advertisement
అప్పట్లో ఎస్వీఆర్ బాగా తాగేవారట. ఓ రోజు పీకలదాకా తాగి జమున ఉంటున్న గది తలుపు తట్టారని జమున ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక తెల్లారే దాకా ఆమెను కూర్చోబెట్టి జీవితం గురించి అనేక విషయాలను, జాగ్రత్తలను చెబుతూ వచ్చారట ఎస్విఆర్. అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లవారే సమయం వరకు చెబుతూ వస్తున్నారు. జమునకు విపరీతంగా నిద్ర వస్తోంది. ఆయన వెళ్లిపోవడం లేదు కోపం పెరిగిపోతుందట. ఇక ఉదయం 5:00 అయింది. అయినా ఆయన గది వదిలి వెళ్ళడం లేదు. కాసేపయ్యాక లేచి బయటకు వెళ్ళిపోతూ ఓ పిల్ల ఓ కుర్ర వ్యక్తితో నీ ప్రేమ వ్యవహారం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. నేను కూడా విన్నాను, అతడు అందరూ ఎన్టీఆర్ అవుతారని చెప్పుకుంటున్నారు. కానీ వాడు మరో తాగుబోతు ఎస్వీఆర్ కావడం పక్క అంటూ జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పి వెళ్ళాడు.
Advertisement
అప్పుడు జమునకు జ్ఞానోదయమైందట. అతడు ఎవరో బయటకు చెప్పకపోయినా సరే ఆ హీరోకు ఉన్న మందు అలవాటు గురించి గుర్తుచేసుకుంది. ఆ మందు అలవాటే ఆయనకు బలహీనతగా మారిందని గ్రహించి అతనితో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుందట. ఆ హీరో ఎవరో కాదు హరనాథ్. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హరనాథ్ మద్యానికి బానిస అవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా శాశ్వతంగా దూరమై, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని జమున ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
Advertisement
also read: