నటసింహ ఎస్వీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలకైనా సరే ఆయన ఇట్టే సెట్ అయిపోతారు. ఏ సినిమాలో అయినా తన పాత్రతో ఇరగదీసేస్తారు ఎస్వీఆర్ గంభీరమైన వాయిస్ మోడ్యులేషన్ తో అందరిని ఆకట్టుకుంటుంటారు తన నటనతో అదరగొట్టేస్తుంటారు. ఎలాంటి పాత్రలకు అయినా సరే ఎస్వీఆర్ తనకి తానే సాటి చాలా రకాల పాత్రలు పోషించి ఆడియన్స్ మనసులో నిలిచిపోయారు. 1947లో వరూధిని సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఎస్విఆర్. తర్వాత 7 ,8 సినిమాలు చేసి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
Advertisement
కానీ పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు పాత్ర పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ కూడా మారిపోయింది ఎన్టీఆర్ కి చెమటలు పట్టేలా చేశారు. 1947లో లీలావతి అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నారు ఎస్వి రంగారావు. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. ఈయన సంపాదించింది అంతా కూడా కొడుకు తాగుడు కోసం ఖర్చు చేసేవాడట. దాంతో చాలా చింతించారట. షూటింగ్స్ కి కూడా తాగి వెళ్లేవారట ఎస్విఆర్. దాంతో చాలా ఇబ్బంది పడేవారిట షూటింగ్ టైం మార్చిన కూడా ఆయన తాగి వెళ్లేవారట.
Advertisement
Also read:
- ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ! ఇన్ని ఉన్నాయా ? అమ్మో
- Ugadi Rashi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు 2024 నుంచి 2025 వరకు
- పోకిరి vs అత్తారింటికి దారేది రెండిటిలో ఏది పెద్ద హిట్ ?
కృష్ణ గారి పండంటి కాపురం సినిమా టైంలో కూడా ఇదే జరిగింది కానీ కృష్ణ తనపై పెట్టుకున్న నమ్మకం తో ఎస్ తాగడం మానేసి సినిమా షూటింగ్ అయ్యేవరకు కూడా మందు ముట్టుకోలేదట తర్వాత సినిమాల్లో అవకాశాలని కోల్పోయారు. ఒకపక్క కొడుకు మరో పక్క భార్య భారాన్ని చూసి ఆయన ఎంతగానో నలిగిపోయారు. ఈ బాధతో తాగుడు మరింత ఎక్కువైంది. ఈ వ్యసనానికి పూర్తిగా బానిస అయిపోయారు. ఎంత తాగినా మాత్రం నటనకి ప్రశంసలు కచ్చితంగా వచ్చేవి. నటనలో ఏ ఇబ్బంది ఉండేది కాదట. 1974 లో గుండెపోటుతో అస్వస్థకి గురయ్యారు. అయినా సరే సినిమాల మీద సినిమాలు చేశారు 1974 జులైలో 18న గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!