Home » “సూర్య‌వంశం” బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…ఏం చేస్తున్నాడంటే..!

“సూర్య‌వంశం” బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…ఏం చేస్తున్నాడంటే..!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమాలో న‌టీన‌టుల‌తో పాటూ చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా కీల‌క‌మైన పాత్ర‌లు పోశిస్తూ ఉంటారు. చిన్న‌నాటి హీరోహీరోయిన్ లు మ‌రియు కామిక్ రోల్స్ తో పాటూ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు న‌టిస్తూ ఉంటారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ లు గా ఎంట్రీ ఇచ్చి ఇండ‌స్ట్రీలో హీరోలుగా ఎదిగిన హీరోలు కూడా ఎంతో మంది ఉన్నారు. టాలీవుడ్ లో అల ఎదిగిన హీరోలు త‌నిష్, త‌రుణ్‌…వీరిద్ద‌రూ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ లుగానే కెరీర్ ను మొదలుపెట్టారు.

Advertisement

 

త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక య‌వ్వ‌నం రాగానే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక చిన్న‌త‌నంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ఆనంద్ వ‌ర్ద‌న్…..మ‌నసంతా నువ్వే సినిమాలో చిన్న‌నాటి ఉద‌య్ కిర‌ణ్ లా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

Advertisement

తూనీగా తూనీగా అంటూ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా వెంక‌టేష్ హీరోగా న‌టించిన సూర్య‌వంశంతో కూడా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. సూర్య‌వంశం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించాడు. అయితే ఈ సినిమాలో కూడా ఆనంద్ వ‌ర్ద‌న్ నే చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకోవ‌డం విశేషం.

అదేవిధంగా అర్జున్ హీరోగా న‌టించిన శ్రీమంజునాద సినిమాలో న‌టించి అల‌రించాడు ఈ సినిమాల‌తో పాటూ మ‌రికొన్ని సినిమాల్లో న‌టించి ఆనంద్ వ‌ర్ద‌న్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ప్రియ‌రాగాలు సినిమాలో బోర్ కొట్టిందంటే ఎవ‌రో ఒక‌రికి ఫోన్ చేసి వాళ్ల‌తో ఆడుకునే పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాకు నంది అవార్డును అందుకున్నాడు. ఇదిలా ఉండ‌గా ఆనంద్ వ‌ర్ధన్ ఇప్పుడు సినిమాలలో హీరోగా కూడా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆకాశవాణి సినిమాలో హీరోగా న‌టించాడు.

Also Read: క‌ర్నాట‌క‌లో ప్ర‌తి థియేటర్ లో సీటు నంబ‌ర్ 17 ఖాళీ….ఎందుకో తెలుసా…!

Visitors Are Also Reading