Home » పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్.. వరుడు ఎవరంటే ?

పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్.. వరుడు ఎవరంటే ?

by Anji
Ad

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాప్ట్ వేర్ డెవలపర్ తరువాత షన్నూ నటించిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మౌనిక రెడ్డి కథానాయికగా కనిపించింది. ఈ సిరీస్ తో రాత్రికి రాత్రి స్టార్ డమ్ తెచ్చుకుంది మౌనిక. 

Advertisement

అదే క్రేజ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో  మౌనికా రెడ్డి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ సినిమాలో లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించింది. ఇటీవల వచ్చిన ఓరి దేవుడా సినిమాలోనూ నటించింది. నిఖిల్ హీరోగా న‌టిస్తున్న 18 పేజీస్ సినిమాలో న‌టిస్తోంది. అటు వెండి తెరపైనే కాకుండా ఇటు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. మౌనికా రెడ్డి వైజాగ్ బీటెక్ పూర్తిచేసింది. ప్ర‌స్తుతం హెచ్ ఆర్ గా ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. ఇక టాలెంట్ అదృష్టంతో సినిమా ఛాన్స్ లు ద‌క్కించుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతోంది.

Advertisement

Also Read :  పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

Manam News

తన ప్రియుడు సందీప్ తో ఏడడుగులు వేయనుంది. అంతేకాదు.. తన పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 17, 18 తేదీలలో గోవాలో డిస్టినేషన్ వెడ్డింగ్ జరుగనున్నట్టు తెలిపింది. వీరు తొలుత  స్నేహితులుగా పరిచయమయ్యారు. కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న వీరు.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటినటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read :  ఒకేఒక్కడు క‌థ‌ను ర‌జీనీ కోసం రాసుకుంటే ఆయ‌న ఎందుకు రిజెక్ట్ చేశారు..? తెర వెన‌క ఇంత జ‌రిగిందా..?

Visitors Are Also Reading