టీమిండియా వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో కూడా గెలిచిందంటే వండర్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ కనుక అందులో కూడా విజయవంతం అయితే ఈ సఫారీ టూర్ పూర్తిగా సక్సెస్ అయినట్లే. టీమిండియా కి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. భారత్ క్రికెట్ అభిమానులకి ఇది తీవ్ర ఆందోళనని కలగజేస్తుంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్ లలో భారత్ టీ20 జట్టు కి కెప్టెన్గా వ్యవహరించాల్సిన సూర్య కుమార్ యాదవ్ కొన్ని వారాల పాటు క్రికెట్ కి దూరంగా ఉంటున్నారు.
Advertisement
సూర్య కుమార్ దక్షిణాఫ్రికా తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ఫీల్డింగ్ చేస్తున్న టైంలో కాలు బెణికింది. దీంతో సూర్య కుమార్ యాదవ్ మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. చివరికి మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం ప్రభావం పెద్దగా కనపడలేదు నడవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా రాలేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సూర్య స్కానింగ్ చేయించుకున్నారు అందులో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతానికి సూర్య కుమార్ యాదవ్ కొన్ని రోజులు పాటు క్రికెట్ కి దూరంగా ఉండాలని ఫుల్లుగా రెస్ట్ తీసుకోవాలని తెలుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం చూసినట్లయితే సూర్య దాదాపు 7 వారాల పాటు క్రికెట్ కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
జరిగే మూడు మ్యాచ్ లలో టీ20 సిరీస్ కి సూర్యకుమార్ దూరం కాబోతున్నారు ప్రస్తుతం అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడు. అక్కడే కొన్ని రోజులు పాటు చికిత్స తీసుకుంటున్నట్లు బిసిసిఐ ఉన్నత అధికారి చెప్పారు. ఒకవేళ సూర్య కుమార్ యాదవ్ క్రికెట్ కి దూరమైతే బిసిసిఐ సెలక్షన్ కమిటీ ముందు పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే గత ఏడాదికాలంగా జట్టును నడిపిస్తున్న హార్దిక్ కూడా గాయం కారణంగా క్రికెట్ కి దూరమయ్యారు. ఒకవేళ కనుక సూర్య కూడా దూరమైతే ఆఫ్గనిస్తాన్ తో జరిగే సిరీస్ కి టీమిండియా కెప్టెన్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నగా ఉంది. వేరొకరికి కెప్టెన్సీ అవకాశాన్ని ఇస్తుందా లేదంటే రోహిత్ శర్మని మళ్ళీ తీసుకుంటుందా అనేది చూడాలి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!