మాజీ క్రికెటర్ సురేష్ రైనా మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత బ్యాట్ పట్టని ఈ లెజెండరీ క్రికెటర్ 2024 ఐపీల్ లో మరోసారి గ్రౌండ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ గా కాదు తన సేవలను యువ క్రికెటర్లకు అందించాలని. లక్నో సూపర్ జేయింట్స్ జట్టు సురేష్ రైనాను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సురేష్ రైనా కూడా అంగీకరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతనితో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు లీకులు వస్తున్నాయి. తాజాగా రైనా చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. లక్నో ఫ్రాంచైజీతో రైనా ఒప్పందం కుదుర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని ఓ జర్నలిస్ట్ ఓ ట్వీట్ చేశారు. అందుకు రైనా స్పందిస్తూ… ఎందుకు ఈ వార్తలు నిజం కాకూడదు అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో రైనాను కొత్త అవతారంలో చూడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. గత రెండు సీజన్లుగా తమ జట్టు మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను ఐపీఎల్ 2024 వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ప్రస్తుతం లక్నో మెంటర్ పదవి ఖాళీగా ఉంది.
Advertisement
ఈ క్రమంలోనే గంభీర్ స్థానాన్ని మిస్టర్ ఐపీఎల్ తో భర్తీ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. మిస్టర్ ఐపిఎల్ గా పేరొందిన రైనా 205 మ్యాచ్లు ఆడి, 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు. చెన్నై ఛాంపియన్ గా నిలిచిన నాలుగుసార్లు రైనా ఆ జట్టులో ఉన్నాడు. ఈ వార్త విన్న రైనా అభిమానులు తన మార్క్ ఆటను యువ ప్లేయర్లలో చూడొచ్చని ఆనందపడుతున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.