Home » డాక్టర్ అయిపోయిన రైనా..!

డాక్టర్ అయిపోయిన రైనా..!

by Azhar
Ad

భారత మాజీ ఆటగాడు, ప్రస్తుతం కామెంటేటర్ సురేష్ రైనా గురించి అందరికి తెలిసిందే. టీ20 క్రికెట్ లో ఇండియా తరపున మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన రైనా.. బ్యాటింగ్ లో చాలా రికార్డులు నెలకొల్పాడు. అలాగే బౌలింగ్ లో కూడా జట్టు విజయాలలో భాగం అయ్యాడు. ఇక ఇండియా జట్టు తరపున ఆడిన బెస్ట్ ఫీల్డర్లు లో రైనా కూడా ఉంటాడు. అలంటి రైనా తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.

Advertisement

అయితే ఇండియా జట్టుకు ఆడకపోయినా కూడా రైనా ఐపీఎల్ లో చెలరేగేవాడు. అందుకే అతనికి మిస్టర్ ఐపీఎల్ అనే పేరు కూడా వచ్చింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలలో రైనాది చాలా ముఖ్యమైన పాత్ర. కానీ ఈ ఏడాది జరిగిన మెగావేలానికి రైనాను చెన్నై జట్టు వదిలేయగా.. అతడిని మిగిలిన ఎవరు తీసుకోలేదు. దాంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.

Advertisement

అందువల్ల ఫ్యాన్స్ చాలా భాధ పడ్డ.. ఇప్పుడు వారికీ ఓ గుడ్ న్యూస్ అనేది వచ్చింది. రైనా ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. చెన్నైలోని వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సురేష్ రైనాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న రైనా.. ఈ గౌరవాన్ని పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికి నాకు ప్రత్యేకమైనది అని రైన్ ఆతెలిపాడు.

ఇవి కూడా చదవండి :

విరాట్ కు అదనపు బాధ్యతలు ఇవ్వనున్న బీసీసీఐ..?

అప్పుడు ధోని రోహిత్ ను.. ఇప్పుడు అతను సూర్యను..!

Visitors Are Also Reading