Home » సినిమాల ద్వారా సురేఖ‌వాణి అన్ని కోట్లు సంపాదించిందా…? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..?

సినిమాల ద్వారా సురేఖ‌వాణి అన్ని కోట్లు సంపాదించిందా…? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌లో సురేఖ‌వాణి కూడా ఒక‌రు. అక్క‌, త‌ల్లి పాత్ర‌ల‌తో సురేఖవాణి అభిమానుల‌ను సంపాదించుకుంది. కేవ‌లం సినిమాల‌లోనే కాకుండా సురేఖ‌వాణికి సోష‌ల్ మీడియాలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఏజ్ పెరిగినా హీరోయిన్ రేంజ్ లో ఫిట్నెస్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఫ్యాన్స్ ను సంపాదిచుకుంది. సురేఖ‌వాణి భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలింసిందే. ఇక సురేఖ‌వాణికి సుప్రీత అనే కూతురు ఉంది.

Advertisement

సుప్రీత కూడా త‌ల్లికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సోష‌ల్ మీడియాలో సంపాదిచుంది. ప్రస్తుతం సుప్రీత మోడ‌లింగ్ తో పాటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లోనూ సుప్రీత త‌ల్లిని మించిపోతోంది. మ‌రోవైపు వీరిద్ద‌రూ క‌లిసి ప‌బ్బుల‌కు పార్టీల‌కు వెళుతూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Advertisement

అయితే ఆ ఫోటోల‌ను చూసిన‌ నెటిజ‌న్లు సురేఖ‌వాణి రిచ్ లైఫ్ చూసి ఆశ్చర్య‌పోతుంటారు. సురేఖ‌వాణికి భారీగానే ఆస్తులు ఉన్నాయని అనుకుంటారు. ఇక సురేఖ‌వాణి ఈ రేంజ్ లో మెయిన్ టెయిన్ చేయ‌డానికి కార‌ణం సినిమాల ద్వారా చేతినిండా సంపాదించ‌డ‌మేన‌ట‌. సురేఖ‌వాణి ఒక్కో సినిమాకు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ ను పుచ్చుకుంటోద‌ని టాక్.

అంతే కాకుండా సినిమా ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ సురేఖవాణి ప‌దికోట్ల వ‌ర‌కూ ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక కేవ‌లం సినిమాల ద్వారా నే కాకుండా సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ ద్వారా కూడా త‌ల్లీకూతుళ్లు భారీగానే సంపాదిస్తున్నార‌ని స‌మాచారం. ఇక దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌ని అంటారు. ఆ సామెత సురేఖవాణికి బాగా సూట్ అవుతుంద‌నే చెప్పాలి.

Visitors Are Also Reading