Telugu News » అత‌డు నీ బాయ్ ఫ్రెండా అంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌…ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అంటూ అస‌లు విష‌యం చెప్పిన సుప్రీత..!

అత‌డు నీ బాయ్ ఫ్రెండా అంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌…ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అంటూ అస‌లు విష‌యం చెప్పిన సుప్రీత..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ముఖ్యంగా బ్రహ్మానందంకు భార్య గా నటించి సురేఖ వాణి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమోషనల్ కామెడీ సన్నివేశాల్లో న‌టించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక‌ సురేఖ వాని కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. త‌న‌ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు ఫేవరెట్ గా మారిపోయింది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా యూజర్లకు బాగా పరిచయం.

Ads

supritha

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే సుప్రీత టిక్ టాక్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. హాట్ ఫోటో షూట్ లు టిక్ టాక్ వీడియోలు చేస్తూ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇక త్వరలో హీరోయిన్ గా కూడా సుప్రిత ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సుప్రిత ఎక్క‌వ‌గా ఫ్రెండ్స్ తో ప‌బ్బుల‌కు వెళుతూ ఆ వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ బ్యూటీకి అమ్మాయిల‌తో పాటూ అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు.

suprithanaidu

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు సుప్రిత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అంతే కాకుండా నచ్చని ప్రశ్నలు వేసిన వారికి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ అభిమాని సుప్రీత తన స్నేహితులతో కలిసి చేసిన వీడియోల‌ను షేర్ చేయగా అతడు ఎవరు..? బాయ్ ఫ్రెండా….. బాయ్ బెస్టీనా అని ప్రశ్నించాడు.

దానికి సుప్రీత అవును ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి అమ్మాయి స్నేహితులుగా ఉండలేరు అని అనుకుంటారు. కానీ మేము స్నేహితులుగా ఉంటాం. ఎవరేమనుకున్నా సరే ఎప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం ఇచ్చింది.


You may also like