Home » ఆడ‌బిడ్డకు ఆస్తిలో స‌మాన వాటా..!

ఆడ‌బిడ్డకు ఆస్తిలో స‌మాన వాటా..!

by Anji
Ad

మ‌హిళ‌ల ఆస్తి హ‌క్కుపై సుప్రీం కోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. వీలునామా రాయ‌కుండా తండ్రి మ‌ర‌ణిస్తే.. ఆయ‌న స్వార్జితం పితార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో కుమార్తెల‌కు వార‌సత్వ హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం. తండ్రి ఆస్తుల‌పై దాయాదుల కంటే ఆయ‌న కుమార్తెల‌కే తొలి హ‌క్కు ఉంటుంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

Supreme Court: Latest news, Updates, Photos, Videos and more.

Advertisement

Advertisement

మ‌ద్రాస్ హై కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ.. దాఖ‌లైన ఓ పిటీష‌న్‌పై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఒక వ్య‌క్తి వీలునామా రాయ‌కుండా మ‌ర‌ణిస్తే.. తొలుత కుమార్తెకు ఆస్తుల‌పై హ‌క్కు ఉంటుంద‌ని చెప్పింది. అయితే కూతురుకు ఉంటుందా లేక అత‌ని సోదరుని పిల్ల‌ల‌కు ఉంటుందా..? అనే సందిగ్దాన్ని ప‌రిష్క‌రిస్తూ.. దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక‌వేల హిందూ మ‌హిళా వీలునామా రాయ‌కుండా మ‌ర‌ణిస్తే.. ఆమెకు త‌న తండ్రి నుంచి సంక్ర‌మించిన ఆస్తిపై తండ్రి వార‌సులంద‌రికీ స‌మాన హ‌క్కు ఉంటుందిన స్ప‌ష్టం చేసింది. అదే మ‌హిళ‌కు భ‌ర్త‌, అత్త‌మామ‌ల ద్వారా వ‌చ్చిన ఆస్తుల‌పై వీలునామా లేక‌పోతే భ‌ర్త వార‌సుల‌కు హ‌క్కులు లభిస్తాయ‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Visitors Are Also Reading