మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ హీరోగా, అలాగే నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను చిత్ర పరిశ్రమకు అందించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మన మధ్య లేకపోయినా ఇప్పటికీ.. సూపర్ స్టార్ కృష్ణ కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలకు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ ఎదిగిపోయారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ హీరోగా కృష్ణ రికార్డు సృష్టించారు.
Advertisement
ఇక సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకడు ఇందిరాదేవి అయితే మరొకరు విజయనిర్మల. అయితే సూపర్ స్టార్ కృష్ణ మొదటి సంతానం అయిన పద్మావతికి ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం 1991 జూన్ మాసంలో చెన్నైలో జరిగింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేస్తున్నారు. ఆమె హీరోయిన్ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో తన కూతురి పెళ్ళికి రావాలని జయలలితకు కూడా ఆహ్వానం పంపాడు సూపర్ స్టార్ కృష్ణ. అలాగే ఈ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖులు తదితరులు వచ్చారు.
Advertisement
అయితే ఈ పెళ్లికి జయలలిత రావాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా జయలలిత ఉన్న నేపథ్యంలో ఆమెకు విపరీతమైన సెక్యూరిటీ ఉంది. దీంతో పెళ్లి మండపం కు ముందుగానే ఆమె సెక్యూరిటీ వచ్చి… పెళ్లి మండపం ముందు వరుసలో అందరినీ ఖాళీ చేయించిందట. అలాగే చాలామంది ప్రముఖులను ఆ సెక్యూరిటీ సిబ్బంది ఇన్సల్ట్ చేసిందట. ఇక ఇదంతా చూసిన సూపర్ స్టార్ కృష్ణ.. ఈ సెక్యూరిటీ గోల తనకు వద్దు.. జయలలిత వల్ల పెళ్లికి వచ్చిన ప్రముఖులకు అవమానం జరిగేలా ఉంది అని నిర్ణయం తీసుకున్నాడట. దీంతో తన కూతురు పెళ్లికి జయలలితను రావద్దని కోరాడట సూపర్ స్టార్ కృష్ణ. ఇక అతన్ని అర్థం చేసుకున్న జయలలిత.. తన వ్యక్తులతో పెళ్లికి కానుకలు కూడా పంపిందట.
ఇవి కూడా చదవండి
శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !