Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కృష్ణ ఫారెన్ కార్ కొనాలనే కల నెరవేరడం కోసం ఏం చేశారో తెలుసా..?

కృష్ణ ఫారెన్ కార్ కొనాలనే కల నెరవేరడం కోసం ఏం చేశారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.. ఆయన తన నటన టాలెంట్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 350 పైగా సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఈ మధ్యకాలంలోనే పరమపదించారు.. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గురించి నటుడు చంద్రమోహన్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కృష్ణ చంద్రమోహన్ ఓకే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారని, ఇద్దరు ఒకేసారి అవకాశాల కోసం ట్రై చేసే వాళ్ళమని అన్నారు.

Advertisement

Ad

also read:రామ్ చరణ్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్…ఆ సినిమా ఏదంటే…?

అంతేకాకుండా మద్రాసులో రామ్మోహన్ నేను ఒకే రూమ్ లో ఉండే వాళ్ళం కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం సపరేట్గా ఉండేవారు, అప్పుడప్పుడు మా రూమ్ కి వచ్చి మాతో కాస్త టైం స్పెండ్ చేసే వారని తెలియజేశారు. కృష్ణ మొదటి నుంచి చాలా టాలెంట్ ఉన్న హీరో. ఆయన అనుకున్నది తప్పనిసరిగా చేసే వరకు విడిచిపెట్టారు.. ప్రయత్నాలు చేస్తూనే నిర్మాతలతో పరిచయాలు పెంచుకునేవాడు. ఎప్పుడో ఒకసారి మా రూమ్ కి వచ్చినప్పుడల్లా నేను ఆ సినిమాలో నటిస్తున్నానని చెప్పేవాడు. కృష్ణ విధంగా చెబుతుంటే మేము ఆశ్చర్యపోయేవారమని చంద్రమోహన్ అన్నారు. కృష్ణ టాలెంట్ కు అప్పట్లో దర్శక నిర్మాతలు కూడా మెస్మరైజ్ అయ్యేవారు.. ఒక్కసారి ఆయన ఏదైనా పాత్రలో చేస్తే మళ్లీ మళ్లీ ఆయనతో సినిమాలు చేయడానికి అదే దర్శక నిర్మాతలు ముందుకు వచ్చేవారు. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండేదని అన్నారు చంద్రమోహన్.

అప్పట్లో రామకృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు ఉన్నా కానీ నాకు ఎక్కువగా కృష్ణ తోనే అనుబంధం ఉండేదని తెలియజేశారు.. కృష్ణ ఫారిన్ కారు కొనాలని ఎక్కువగా కలలు కంటూ ఉండేవారని ఆ విషయాన్ని మాకు చెబుతూ ఉంటే మేము అది తేలికైన విషయం కాదని అనేవాణ్ణి… కానీ తన నటన టాలెంట్ తో తాను అనుకున్నది సాధించారు. కృష్ణతో దాదాపుగా 40 పైగా సినిమాలు చేశానని, కృష్ణ విజయనిర్మలకు పెద్ద అభిమానిని అంటూ ఆయన ఇండస్ట్రీకి దూరం అవడం బాధాకరమని ఎమోషనల్ అయ్యారు చంద్రమోహన్.

Advertisement

also read:

Visitors Are Also Reading