Home » బిగ్ బ్రేకింగ్ : సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు క‌రోనా

బిగ్ బ్రేకింగ్ : సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు క‌రోనా

by Anji
Ad

క‌రోనా మ‌హ‌మ్మారీ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. వారు వీరు అని తేడా లేకుండా విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ఒక‌రి త‌రువాత ఒక‌రు క‌రోనా బారీ ప‌డుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్రముఖులు క‌రోనా బారిన ప‌డి ఐసోలేష‌న్లో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిన‌దే. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేశారు.

Tollywood superstar Mahesh Babu marks 42 years in Telugu film industry- The  New Indian Express

Advertisement

Advertisement

నా ప్రియ‌మ్ఐన అభిమానులకు, శ్రేయాభిలాషుల‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను. అయినా నేను క‌రోనా బారిన ప‌డ్డాను. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో క‌రోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం నేను ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో వైద్యుల సూచ‌న‌ల‌తో చికిత్స తీసుకుంటున్నారు. ద‌య‌చేసి ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారు అంద‌రూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రు అయితే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు వెంట‌నే వ్యాక్సిన్ తీసుకోండి. అది క‌రోనా తీవ్ర‌త నుండి హాస్పిట‌ల్ వ‌ర‌కు వెళ్ల‌కుండా కొద్దిగా అయినా త‌ప్పిస్తుంది. ద‌య‌చేసి అంద‌రూ క‌రోనా నియ‌మాలు పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండండి. మ‌ళ్లీ తిరిగి రావ‌డానికి వేచి ఉండ‌లేను అంటూ ట్వీట్ చేశారు. మ‌హేష్‌కు క‌రోనా సోక‌డంతో ఆయ‌న అభిమానులు కాస్త ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కొంద‌రూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరుతున్నారు.

Visitors Are Also Reading