టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కృష్ణ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఒకప్పటి స్టార్ హీరో లలో ఆయన కూడా ఒకరిగా రాణించారు. ఇక కృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే కృష్ణ నటించిన అన్ని సినిమాల్లోకెల్లా సింహాసనం సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమా బాహుబలికి మించిన రికార్డులను అప్పట్లో క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించడంతోపాటు తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.
Advertisement
మొదట ఈ సినిమాను ఇతర నిర్మాతలు నిర్మించాలని అనుకున్నారు. కానీ సినిమాకు 3 కోట్ల 50 లక్షల బడ్జెట్ అవుతుందని వెనకడుగు వేశారు. అప్పట్లో కేవలం 50 లక్షల బడ్జెట్ తోనే సినిమాలను నిర్మించేవారు. కానీ కృష్ణ ముందుకు వచ్చి సాహసం చేసి మరీ ఈ సినిమాను 3కోట్ల 50 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. కేవలం 53 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.
Advertisement
ఈ చిత్రంలో కృష్ణకు జోడిగా మందాకిని, జయప్రద, రాధలు నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 1986 మార్చి 21న విడుదలైంది. ఇక ఇదే సినిమాను హిందీలో కూడా చిత్రీకరించారు. అయితే హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక సింహాసనం సినిమా రికార్డుల విషయానికి వస్తే…. ఈ సినిమా చూసేందుకు థియేటర్ల ముందు జనాలు 12 కిలోమీటర్ల వరకు క్యూ కట్టారు అంటే ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి వారంలోనే రూ.1.51 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. సింగిల్ థియేటర్ లో ఏకంగా రూ.15లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని ఓ థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా వంద రోజుల వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఏకంగా 400 బస్సుల్లో రావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.