సినీపరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఇప్పుడే కాదు. అప్పట్లో కూడా ఉండేది. స్టార్ హీరో స్టేటస్ కోసం సూపర్ హిట్ల కోసం హీరోలు పోటీపడుతూ ఉండేవారు. అయితే మొదట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల మధ్యలో పోటీ కనిపించేది. కానీ ఆ తరవాత రేసులోకి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎంటర్ అయ్యారు. కృష్ణ అప్పుడు యంగ్ హీరో కావడం యూత్ లో క్రేజ్ ఉండటంతో ఎన్టీఆర్ కు సవాల్ గా సినిమాలు చేసేవారని టాక్ ఉండేది. అంతే కాకుండా ఎన్టీఆర్ సినిమా విడుదలలయ్యే రోజునే కృష్ణ కూడా సినిమాలను విడుదల చేసేవారట.
ALSO READ : అల్లు అర్జున్ రష్మిక సీన్ పై మోహన్ బాబు సెటైర్లు…?
Advertisement
ఎన్టీఆర్ ప్రేమ కథా చిత్రాలు చేస్తే అటాంటి సినిమాలే చేయడం….పౌరానిక సినిమాల్లో నటిస్తే అలాంటి సినిమాలే చేయడం లాంటివి కూడా చేసేవారట. అంతే కాకుండా కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను ఎన్టీఆర్ తాను చేయాలనుకోగా అప్పటికే కృష్ణ వినకుండా విడుదల చేయడంతో ఇద్దరి మధ్య వివాదాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపించేవి.
Advertisement
కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ కృష్ణ ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చారనే వార్తలు కూడా వినిపించేవి. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారనే కారణంతోనే కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ కొన్ని సినిమాలు కూడా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అంతే కాకుండా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరవతనే ఆ సినిమాలు చేశారని కూడా వార్తలు వినిపించేవి. సింహాసనం, మండలాదీశుడు, సాహసమే నా ఊపిరి, నా పిలుపు ప్రభంజనం, ఊపిరి లాంటి చిత్రాలు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీశారని…ఈ సినిమాలలో ఎన్టీఆర్ ఊతపదాలను ఉపయోగించారని అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ సినిమాలపై టీడీపీ అభిమానులు ఫైర్ అయ్యేవారట.