Home » సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న జీవితంలో చేసిన 4 త‌ప్పులు ఇవే..ఎందుకు చేయాల్సివ‌చ్చిందంటే…!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న జీవితంలో చేసిన 4 త‌ప్పులు ఇవే..ఎందుకు చేయాల్సివ‌చ్చిందంటే…!

by AJAY
Ad

సినిమాల్లోకి వ‌చ్చిన అతిత‌క్కువ కాలంలోనే కృష్ణ సూప‌ర్ స్టార్ గా ఎదిగారు. ఆయ‌న గ‌ట్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ప్రయోగాత్మ‌క సినిమాలు చేసి ఆయ‌న సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కేవ‌లం సినిమాల‌నే కాకుండా కృష్ణ మ‌న‌స్థ‌త్వం బ‌ట్టి కూడా చాలా మంది అభిమానులు అయ్యారు. అయితే కృష్ణ గారు త‌న జీవితంలో మూడు త‌ప్పుల‌ను చేశార‌ని అంటూ ఉంటారు.

Advertisement

అందులో మొదటిది హీరోయిన్ కావాల‌నుకున్న త‌న కూతురిని ఆప‌డం. నిజానికి మంజుల హీరోయిన్ అవుతానంటే కృష్ణ నో చెప్ప‌లేదు. కానీ సూప‌ర్ స్టార్ అభిమానులు మాత్రం మంజుల హీరోయిన్ గా చేయకూడ‌ద‌ని ర‌చ్చ చేశారు. దాంతో కృష్ణ వెన‌క్కిత‌గ్గాల్సి వ‌చ్చింది. కృష్ణ కు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా చాలా మందికి న‌చ్చ‌లేదు. చెప్పుడు మాట‌లు విన‌డం వ‌ల్లే బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో వైరం ఏర్ప‌డింద‌ని చెబుతుంటారు.

Advertisement

ఇక ఈ మ్యాట‌ర్ గురించి చాలా మందికి పెద్ద‌గా తెలియ‌దు. ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావుతో హీరో శోభ‌న్ బాబుతో సంసారం అనే సినిమా తీశాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దాంతో రేలంగి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాన‌ని కృష్ణ చెప్పాడు. కానీ ఈ సినిమా విష‌యంలోనూ రేలంగి త‌ప్పులేకున్నా కృష్ణ ఆయ‌న పై ఫైర్ అయ్యార‌ట‌. ఇదే మూడో తప్పు…ఇదిలా ఉండ‌గా నిర్మాత రామానాయుడు కృష్ణ శోభ‌న్ బాబు హీరోలుగా ముందడుగు సినిమా చేశారు.

ఆ త‌ర‌వాత కృష్ణతో మ‌రో సినిమా చేయాల‌ని రామానాయుడు కోరార‌ట‌. దాంతో కృష్ణ ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు ఉండాల‌ని…ర‌చ‌యిత‌లుగా ప‌రిచూరి బ్ర‌ద‌ర్స్ ఉండాల‌ని కండిషన్స్ పెట్టారు. అయిన‌ప్ప‌టికీ రామానాయుడు ఓకే చెప్పి వారిని సెట్ చేశార‌ట‌. కానీ కృష్ణ తాను వేరే నిర్మాత‌తో క‌మిట్ అయ్యాన‌ని కావ‌లంటే ఇద్ద‌రి భాగ‌స్వామ్యంలో చేస్తాన‌ని చెప్పార‌ట. దాంతో రామానాయుడు హ‌ర్ట్ అయ్యి ఆ సినిమాను ప‌క్క‌న పెట్టేసి వెంక‌టేష్ ను హీరోగా ప‌రిచ‌యం చేశార‌ట‌.

AlSO READ : నందమూరి తారక రామారావు త‌న‌ మనవరాళ్ల పేర్లు అలా ఎందుకు పెట్టారు..? వాళ్ళ పేర్లు ఏంటంటే ?

Visitors Are Also Reading