Home » మంచువిష్ణు సినిమా కోసం సన్నీ ఎంత తీసుకుంటుందో తెలుసా..!

మంచువిష్ణు సినిమా కోసం సన్నీ ఎంత తీసుకుంటుందో తెలుసా..!

by AJAY
Ad

మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం గాలి నాగేశ్వ‌ర‌రావు. ఈ సినిమాకు ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో స‌న్నిలియోన్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. రేణుక అనే ఎన్నారై పాత్ర‌లో స‌న్నిలియోన్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తొలి షెడ్యూల్ ను తిరుప‌తిలో పూర్తిచేశారు. అయితే ఈ సినిమా కోసం స‌న్నిలియోన్ భారీగా రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

ఈ చిత్రం కోసం స‌న్నిలియోన్ 20 రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొనబోతుంద‌ట‌. అందుకోసం రూ.2 కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ట‌. నిజానికి స‌న్నిలియోన్ బాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగులో మాత్రం మంచు మనోజ్ హీరోగా న‌టించిన క‌రెంట్ తీగ సినిమాలో న‌టించింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ తెలుగులో క‌నిపించ‌లేదు. నిజానికి తెలుగులో ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నిలియోన్ ను సంప్ర‌దించినా ఆమె డిమాండ్ చేసే రెమ్యున‌రేష‌న్ వ‌ల్లే డ్రాప్ అయ్యారట‌. ఇక ఇప్పుడు మంచు వారితో స‌న్నిలియోన్ రెండో సినిమా చేస్తుండ‌టం విశేషం.

Visitors Are Also Reading