బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు అందరూ ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని బిగ్ బాస్ సీజన్ల కంటెస్టెంట్ ల మాదిరిగానే సీజన్ 5 కంటెస్టెంట్లు కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన సన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిరి షణ్ముక్ రిలేషన్ షిప్ పై సన్నీ ఓపెన్ అయ్యాడు.
Advertisement
Advertisement
సిరికి ఓ మాట చెప్పాలనుకున్నాను. దోస్తాన్ దోస్తానే కానీ బయట నిన్ను నమ్మకుని ఓ మనిషి ఉన్నాడు పాపం అతడు ఫీల్ అవుతాడు. అని చాలా సార్లు చెప్పాలనుకున్నా కానీ వాళ్లు తీసుకోరు అనిపించింది. దానికి కారణం వాళ్లను మాట్లాడిద్దాం అనుకుని వెళ్లినప్పుడల్లా మాకు కొంచెం సమయం కావాలి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు అంటారు మాట్లాడ్డానికే ఇష్టపడని వాళ్లకు ఏం చెబుతాం అంటూ కామెంట్లు చేశారు. ఇది ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి షణ్ముక్ ల తీరుపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ముద్దులు హగ్గుల మ్యాటర్ ఈ సీజన్ లో ఎక్కువ హైలెట్ అయ్యింది.
ఇద్దరూ సింగిల్స్ అయితే ఏ బాధ ఉండేది కాదు కానీ అప్పటికే సిరికి శ్రీహాన్ అనే యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక షణ్ణు కూడా దీప్తి సునయన తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. సిరి తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయంపై షణ్ముక్ ను నిలదీయగా మధ్యలో సన్నీ వచ్చి తనది మానస్ ది ఎలాంటి రిలేషన్ షిప్పో వాళ్లిద్దరి కూడా అలాంటి రిలేషన్ షిప్ యే నని చెప్పాడు.