Home » మెగాస్టార్ సినిమాలో తల్లిగా హీరోయిన్ సుమలత…!

మెగాస్టార్ సినిమాలో తల్లిగా హీరోయిన్ సుమలత…!

by Azhar
Ad
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో తెగ బిజీగా యూత్ విషయం తెలిసిందే. చివరిగా నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మారడంతో.. అభిమానుల ముందు మరో సినిమాను తొందరగా తీసుకువచ్చి.. ఆచార్యను జనం మరిచిపోయేలా చేయాలనీ అనుకుంటున్నారు చిరు. అందుకే ఒక్కేసారి మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అందులో మెగాస్టార్ 154 సినిమాగా రాబోతున్న వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ షాకింగ్ విషయం అనేది తెలుస్తుంది.
అదేంటంటే.. ఈ సినిమా అలనాటి హీరోయిన్ సుమలత తల్లిగా కనిపించబోతుంది అని తెలుస్తుంది. అయితే అప్పట్లో  చిరంజీవి, సుమలత హీరో హీరోయిన్ గా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అప్పుడు వీరిది మంచి హిట్ కాంబో అనే పేరు కూడా వచ్చింది. అలాంటిది చిరు సినిమాలో ఇప్పుడు సుమలత తల్లిగా కనిపించడం ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలో సుమలత తల్లిగా నటిస్తుంది.. కానీ చిరంజీవికి తల్లిగా నటించడం లేదు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే రవితేజ ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని సినిమాను నిర్మిస్తున్న.. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఓ వీడియోను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సుమలత ఈ సినిమాలో రవితేజకు తల్లిగా కనిపించబోతుంది అని తెలుస్తుంది. హీరోయిన్ గా కెరియర్ ముగిసిన తర్వాత సుమలత తన సెకండ్ కెరియర్ అనేది ప్రారంభించి.. హీరో తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే ఇందులో రవితేజకు అమ్మగా నటిస్తుంది అని సమాచారం.

Advertisement

Visitors Are Also Reading