Anchor Suma: యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సుమ అందరికీ సుపరిచితమే యాంకర్ గా ఎప్పటినుండో కూడా ఆమె దూసుకు వెళ్లి పోతోంది. అందరినీ ఆకట్టుకుంటూ ఉంటోంది. స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్స్ లో ఈవెంట్లలో కూడా పాల్గొని అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సుమ కనకాల బుల్లితెర మీద ఒక సెన్సేషన్. రెండు దశాబ్దాలుగా ఈమె హవా నడుస్తోంది. మలయాళ అమ్మాయి అయిన సుమ కనకాల తెలుగు యాంకర్ గ సక్సెస్ అవ్వడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.
Advertisement
తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన మలయాళ ఫ్యామిలీ సుమ వాళ్ళది. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. యాంకర్ కి కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు అందం కూడా ఒకటి. 40 ప్లస్ అయినా కూడా సుమ అందంలో ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా సుమ ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసింది.
Also read:
Advertisement
Also read:
వీడియోలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఉగాది పండుగ అని డైట్ పక్కన పెట్టేసి ఫుడ్ గట్టిగా తినేసింది. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని వర్కౌట్ చేస్తున్న వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పులిహోర, పొంగలి, గారెలు ఇవన్నీ తినేసాను వీటిని కరిగించుకోవడానికి వ్యాయామం చేస్తున్నానని పోస్ట్ చేసింది. సుమ వీడియో మీద నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో మీకు అవసరమా..? మీరు ముసలి వారని కొందరు ఏకీపారేస్తున్నారు . ఆమె మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!