Home » పెళ్లి అనేదే ఒక పంచాయితీ..మొగుడు పెళ్ళాం అన్నాక గొడవలు వస్తాయి : సుమ కనకాల

పెళ్లి అనేదే ఒక పంచాయితీ..మొగుడు పెళ్ళాం అన్నాక గొడవలు వస్తాయి : సుమ కనకాల

by AJAY
Ad

ప్రముఖ యాంకర్ సుమ తాజాగా జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు యాంకర్ గా అదరగొట్టిన సుమ ఈ సినిమా తో నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యం లో సుమ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Advertisement

రీసెంట్ గా అలీతో సరదాగా అనే టాక్ షోలో కూడా సుమ సందడి చేసింది. ఇక ఈ షో ప్రసారం అవ్వగా సుమ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రెండేళ్ల క్రితం మీరు విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. మరి ఆ పంచాయితీ జయమ్మ పంచాయితీ లో ఉంటుందా అని అలి ప్రశ్నించారు. దానికి సుమ మాట్లాడుతూ….అసలు పెళ్లి అనేదే ఒక పంచాయితీ అని వ్యాఖ్యానించింది.

Advertisement

sumakanakala

sumakanakala

ఇద్దరి పంచాయితీ మొదలై 23 ఏళ్ల అయ్యింది. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో…మొగుడు పెళ్ళాం అన్న తర్వాత కచ్చితంగా గొడవలు ఉంటాయి. రోజులో కనీసం రెండు, మూడు సార్లైనా గొడవలు వస్తాయని చెప్పింది. అవి కామన్ కానీ వెబ్ సైట్ వాళ్ళు మేము విడాకులు తీసుకున్నాం అంటూ రాశారు. వార్తలు చూసి బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యింది.

కానీ ఎక్కడా ఏం చెప్పలేదని మొదటి సారి మీ షోలో చెబుతున్నా అంటూ పేర్కొంది. ఇక తమ కుమారుడికి నటుడు అవ్వాలని ఉందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు చెబుతా అని పేర్కొంది. అదే విధంగా తన కూతురు కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తోందని చెప్పింది. ఫ్యూచర్ కూడా మంచి కథలు వేస్తే సినిమాలు చేస్తాను అంటూ సుమ వెల్లడించింది.

Visitors Are Also Reading