Home » పుష్ప 2కు సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…?

పుష్ప 2కు సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…?

by Azhar
Ad
టాలీవుడ్ లో మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. 2004లో ఆర్య సినిమాతో దర్శకునిగా వచ్చిన సుకుమార్ ఆ తర్వాత జగడం సినిమాతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే ఆర్య 2, 100 పర్సెంట్ లవ్ సినిమాతో మంచి హింట్ అందుకొని సక్సెస్ ఫుల్ దర్శకునిగా.. లేఖల మాస్టర్ గా మారిపోయారు. అయితే ఎప్పుడు సినిమా రియాలిటీకీ దగ్గరగ్గా ఉండాలని అనుకుంటాడు. అందుకే సినిమాను చాలా మాసీగా.. నిజ జీవితంలా కనిపించేలా తీస్తాడు.
సుకుమార్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన పుష్ప సినిమా చూస్తేనే మనకు అది అర్ధం అయిపోతుంది. అందులో అల్లు అర్జున్ లుక్ చూస్తేనే సుకుమార్ వ్యూ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా సినిమా విడుదలైన పుష్ప మంచి విజయం అందుకుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టింది. దాంతో సుకుమార్ రెమ్యునరేషన్ పేచేసినట్లుగా తెలుస్తుంది. పుష్ప ముందు వరకు సుకుమార్ ఒక్కో సినిమాకు దాదాపు 18 కోట్ల వరకు తీసుకునేవాడు.
కానీ పుష్ప సూపర్ హిట్ కావడంతో దాని సీక్వెల్ గా వచ్చే పుష్ప 2 సినిమా కోసం  రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడు. ఏకంగా 40 కోట్లు ఈ సినిమాకు తీసుకుంటున్నాడట. అయితే మన సౌత్ లో అధిక మొత్తంలో పారితోషకం తీసుకునే మొదటి డైరెక్టర్ రాజమౌళి కాగా.. రెండో స్థానంలో తమిళ్ డైరెక్టర్ శంకర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి సుకుమార్ వచేసాడు. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ పుష్ప 2 కూడా సక్సెస్ అయితే ఆయన ఇంకా ఎంత తీసుకుంటాడు అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading