Home » పుష్పను కేజీఎఫ్ సినిమాతో పోల్చలేం…బుచ్చిబాబుతో మాట్లాడా : సుకుమార్

పుష్పను కేజీఎఫ్ సినిమాతో పోల్చలేం…బుచ్చిబాబుతో మాట్లాడా : సుకుమార్

by AJAY
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభిస్తోంది. వసూళ్ళ పరంగా పుష్ప సినిమా దూసుకుపోతున్నప్పటికీ మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాలో క్లైమాక్స్ వీక్ గా ఉందని… సినిమా లెంత్ ఎక్కువైందని కొన్ని క్యారెక్టర్లు అసలు ఎందుకు ఉన్నాయో తెలియడం లేదని రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పుష్ప విడుదలకు ముందు పుష్ప ఈక్వెల్ టు పది కేజీఎఫ్ సినిమాలు అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement

అయితే సినిమాకు ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పై ట్రోల్స్ వస్తున్నాయి. పుష్ప పది కేజీఎఫ్ సినిమాలకు సమానంగా లేదని సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్ రావడంతో సినిమా పై నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. అయితే బుచ్చిబాబు తన కామెంట్ల తో సినిమా పై లేని పోని అంచనాలు పెంచాడని…ఇలాంటి జోకులు సినిమా పై రావటానికి అతడు కూడా ఒక కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. కారణమని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం బుచ్చిబాబు పై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బుచ్చి బాబు చేసిన కామెంట్లపై తాజాగా దర్శకుడు సుకుమార్ స్పందించారు. దేని ప్రత్యేకత దానిదేనని.. తాను బుచ్చిబాబు తో మాట్లాడానని చెప్పారు.

కేజిఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేరు అని పుష్ప అలా కాదని అన్నారు. పుష్ప సినిమాను ఏ సినిమాతో పోల్చలేమని సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సినిమా సూపర్ హిట్ అయిన తరవాత సుకుమార్ ఆఫీస్ ముందు దర్శకులు క్యూ కడతారు అని అలా జరగకుంటే షర్ట్ లేకుండా తిరుగుతా అని అన్నారు. ఇప్పుడు సినిమా కు యావరేజ్ టాక్ రావడం తో అల్లు అర్జున్ పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో లేని పోని అంచనాలను పెంచకూడదు అని సూపర్ హిట్ సినిమాలతో పోల్చకూడదు అని మరోసారి రుజువు అయ్యింది.

Visitors Are Also Reading