పుష్ప సినిమాతో సుకుమార్ క్రేజీ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించడం తో సుకుమార్ డబుల్ జోష్ లో ఉన్నారు. పుష్ప 2 ను ప్రారంభించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.
Advertisement
sukumar
అయితే ఇప్పుడు మెగాస్టార్ తో కూడా సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈరోజు మెగాస్టార్ నివాసానికి వెళ్లిన సుకుమార్ నా కల నిజం కానుంది అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో మెగాస్టార్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సుకుమార్ షేర్ చేశారు. అంతే కాకుండా మెగా స్టార్ చిరంజీవి కోసం మెగా ఫోన్ పట్టుకుంటున్నాను అని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతా అంటూ పేర్కొన్నారు. దాంతో త్వరలోనే సుకుమార్ చిరంజీవి సినిమా పై క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Ad
Advertisement
ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత చిరు మరో మూడు సినిమాలు చేయనున్నారు. ఆ తరవాత సుకుమార తో సినిమా పట్టలెక్కే అవకాశం ఉంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరవాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నారు.b