Home » మాస్ లుక్‌లో అద‌ర‌గొడుతున్న గాలోడు టీజ‌ర్‌..!

మాస్ లుక్‌లో అద‌ర‌గొడుతున్న గాలోడు టీజ‌ర్‌..!

by Bunty
Ad

టీవీషోలు, డ్యాన్స్ రియాలిటీ షోల‌తో బుల్లితెర‌పై మంచి క‌మెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు మ్యాజిక్ షోలు, అదిరిపోయే స్టంట్లు చేస్తూ.. ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ప‌లు కార్య‌క్ర‌మాల్లో త‌న సింగింగ్ ట్యాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించిన అత‌ను వెండితెర‌పై కూడా రాణించేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు.

 

ఇందులో భాగంగా సాప్ట్‌వేర్ సుధీర్‌, 3 మంకీస్ చిత్రాల‌లో హీరోగా న‌టించాడు. అయితే ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ త‌రుణంలోఏ క‌థానాయకుడిగా మ‌రొక‌సారి సుధీర్ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నానికి సిద్ధం అయ్యారు. ఆ సినిమా పేరు గాలోడు. రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైన‌ది.

Advertisement

Advertisement

 

ఇప్ప‌టివ‌ర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్‌గా, హీరోగా ప‌లు సినిమాల‌లో న‌టించిన సుధీర్ ఈ చిత్రంలో తొలిసారిగా మాస్ లుక్‌లో క‌నిపించాడు. యాక్ష‌న్ సీన్ల‌లో అద్బుతంగా న‌టించాడు. ఈ సినిమాల‌లో సుధీర్ స‌ర‌స‌న గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ది. స‌ప్త‌గిరి, పృథ్వీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. కాగా దీంతో పాటు కాలింగ్ స‌హ‌స్ర అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు సుధీర్‌.

 

Visitors Are Also Reading